మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Heramba Ganapati Stotram – హేరంబ స్తోత్రం
గౌర్యువాచ |
గజానన జ్ఞానవిహారకాని-
-న్న మాం చ జానాసి పరావమర్షామ్ |
గణేశ రక్షస్వ న చేచ్ఛరీరం
త్యజామి సద్యస్త్వయి భక్తియుక్తా || 1 ||
విఘ్నేశ హేరంబ మహోదర ప్రియ
లంబోదర ప్రేమవివర్ధనాచ్యుత |
విఘ్నస్య హర్తాఽసురసంఘహర్తా
మాం రక్ష దైత్యాత్త్వయి భక్తియుక్తామ్ || 2 ||
కిం సిద్ధిబుద్ధిప్రసరేణ మోహ-
-యుక్తోఽసి కిం వా నిశి నిద్రితోఽసి |
కిం లక్షలాభార్థవిచారయుక్తః
కిం మాం చ విస్మృత్య సుసంస్థితోఽసి || 3 ||
కిం భక్తసంగేన చ దేవదేవ
నానోపచారైశ్చ సుయంత్రితోఽసి |
కిం మోదకార్థే గణపాద్భృతోఽసి
నానావిహారేషు చ వక్రతుండ || 4 ||
స్వానందభోగేషు పరిహృతోఽసి
దాసీం చ విస్మృత్య మహానుభావ |
ఆనంత్యలీలాసు చ లాలసోఽసి
కిం భక్తరక్షార్థసుసంకటస్థః || 5 ||
అహో గణేశామృతపానదక్షా-
-మరైస్తథా వాసురపైః స్మృతోఽసి |
తదర్థనానావిధిసంయుతోఽసి
విసృజ్య మాం దాసీమనన్యభావామ్ || 6 ||
రక్షస్వ మాం దీనతమా పరేశ
సర్వత్ర చిత్తేషు చ సంస్థితస్త్వమ్ |
ప్రభో విలంబేన వినాయకోఽసి
బ్రహ్మేశ కిం దేవ నమో నమస్తే || 7 ||
భక్తాభిమానీతి చ నామ ముఖ్యం
వేదే త్వభావాన్ నహి చేన్మహాత్మన్ |
ఆగత్య హత్వాఽదితిజం సురేశ
మాం రక్ష దాసీం హృది పాదనిష్ఠామ్ || 8 ||
అహో న దూరం తవ కించిదేవ
కథం న బుద్ధీశ సమాగతోఽసి |
సుచింత్యదేవ ప్రజహామి దేహం
యశః కరిష్యే విపరీతమేవమ్ || 9 ||
రక్ష రక్ష దయాసింధోఽపరాధాన్మే క్షమస్వ చ |
క్షణే క్షణే త్వహం దాసీ రక్షితవ్యా విశేషతః || 10 ||
స్తువత్యామేవ పార్వత్యాం శంకరో బోధసంయుతః |
బభూవ గణపానాం వై శ్రుత్వా హాహారవం విధేః || 11 ||
గణేశం మనసా స్మృత్వా వృషారూఢః సమాయయౌ |
క్షణేన దైత్యరాజం తం దృష్ట్వా డమరుణా హనత్ || 12 ||
తతః సోఽపి శివం వీక్ష్యాలింగితుం ధావితోఽభవత్ |
శివస్య శూలికాదీని శస్త్రాణి కుంఠితాని వై || 13 ||
తం దృష్ట్వా పరమాశ్చర్యం భయభీతో మహేశ్వరః |
సస్మార గణపం సోఽపి నిర్విఘ్నార్థం ప్రజాపతే || 14 ||
ఇతి ముద్గలపురాణే హేరంబ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.